ఆళ్లగడ్డ, (జనస్వరం) : ఆళ్లగడ్డ టౌన్ లో చిన్న చిన్న షాపుల ముందు ఉన్నటువంటి నేమ్ బోర్డు మీద అడ్వర్టైజ్మెంట్ టాక్స్ చెల్లించాలంటూ మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కమిషనర్ పుల్లంపేట కిషోర్ గారికి ఆళ్లగడ్డ జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులు గత కొన్ని నెలల నుండి కరోనా నేపథ్యంలో వ్యాపారం లేక షాపు బాడుగలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం అడ్వటైజ్మెంట్ పన్నులు వేయాలను కోవడం ఎంతవరకు కరెక్ట్ అని తెలియజేశారు. ఆళ్లగడ్డ ప్రజలు ఆస్తిపన్ను, నీటి పన్ను, చెత్త పన్నులు చెల్లిస్తున్న అడ్వర్టైజ్మెంట్ పేరుతో పన్నులు విధించాలని అనుకోవడం ఆళ్లగడ్డ ప్రజల మీద ఆర్థిక భారం మోపడం అని తెలియజేశారు. ఆళ్లగడ్డలో అత్యధికంగా అధికార పార్టీకి కార్పొరేటర్లను ఇచ్చిన ఆళ్లగడ్డ ప్రజలతో అధిక పన్నులు వసూలు చేయడం ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా అని తెలియజేశారు. అడ్వటైజ్మెంట్ పన్నులను చిన్న చిన్న వ్యాపారస్తులకు మినహాయింపు ఇవ్వకపోతే వ్యాపారస్తులతో కలసి మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ తరుపున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ట్రూఆఫ్ చార్జీలతో పేద ప్రజల మీద మరింత భారం మోపడం హేమమైన చర్యగ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాబుహుసేని, ఆంజనేయులు, నరేంద్ర యాదవ్, బావికాడి గుర్రప్ప, రాజారాం, శీను, మద్దిలేటి యాదవ్, నయమత్ ఖాన్, తిమ్మరాజు యాదవ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.