Search
Close this search box.
Search
Close this search box.

అనంతపురం నియోజకవర్గములో జనసేన పార్టీలోకి పలువురు చేరిక

అనంతపురం

    అనంతపురం, (జనస్వరం) :  బాధ్యతగల యువతతోనే  రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి. సి. వరుణ్‌ గారు పేర్కొన్నారు. బుధవారం నగరములోని స్థానిక సప్తగిరి సర్కిల్‌లో ఉన్న బాలాజీ రెసిడెన్సీ లోని పార్టీ కార్యాలయంలో అనంతపురం అర్బన్‌ ఇంఛార్జ్‌, జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్‌ చేతుల మీదగా అఖిల్, రామంజి, ధనుంజయ, జశ్వంత్‌, హర్ష, బాబా ఫక్రుద్దీన్‌, ముక్తార్‌,,కాజా, చరణ్‌ తేజ, చిన్న జాఫరీ, యువకులకు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్‌ గారు మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరడం శుభ పరిణామమని, జనసేన పార్టీ బలోపేతానికీ ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధృతరాష్ట్ర పాలన అంతం చేయాలంటే అది పవన్‌ కళ్యాణ్‌ గారితోనే సాధ్యమవుతుందన్నారు. సామాన్యుల కోసం తన విలాసమైన జీవితాన్ని వదులుకొని సామాన్య ప్రజలకు అండగా నిలవడానికి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. యువతతోనే రాజకీయం చేయించగలగే సత్తా ఉన్న ప్రజా నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్‌ కళ్యాణ్‌ గారే అని,  రాష్ట్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుందని ఆకాంక్షతో యువత పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య  ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనుంజయ, కె. సంజీవ రాయుడు, ఇండ్ల కిరణ్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్‌ కుమార్‌, జనసేన నాయకులు పొదిలి బాబురావు, ముప్పూరీ క్రిష్ణ, పెండ్యాల చిరంజీవి, అంజి, మురళి, సంతోష్‌, శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way