
సిద్ధవటం, (జనస్వరం) : ట్రూ అఫ్ ఛార్జీల పేరుతో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య గారు డిమాండ్ చేశారు. రాజంపేట జనసేన ఇంఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ గారి ఆదేశాల మేరకు సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాటాల రామయ్య గారు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ప్రజలపై భారం మోపం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా కొత్తగా ట్రూ అఫ్ ఛార్జీల పేరుతో యూనిట్ 1 రూపాయి 23 పైసలు భారాన్ని నష్టాల సర్దుబాటు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజలపై భారం మోపడం సమంజసం కాదన్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇప్పుడు ట్రూ అఫ్ పేరుతో కరెంటు ఛార్జీలను అధిక రేట్లు పెంచడం వలన సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి వచ్చే నెల నుండి ట్రూ అఫ్ చార్జీలు లేకుండా చూడాలన్నారు. అనంతరం జనసైనికులు ర్యాలీగా బయలుదేరి ఒంటిమిట్ట విద్యుత్ ఏయికి పెంచిన విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జన సైనికులు తదితురులు పాల్గొన్నారు.