
వెదురుకుప్పం, ( జనస్వరం) : వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లం పంచాయతీ, ఎర్రగుంట్ల గ్రామంలోని ప్రాధమిక పాఠశాల ప్రమాదపు అంచుల్లో ఉన్నదని నియోజకవర్గం ఇంఛార్జ్, రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరి కమిటి సభ్యులు Dr యుగంధర్ పొన్నాల గారు తెలిపారు. పాఠశాలను సందర్శించి మాట్లాడుతూ అమరావతి నుండి అడ్మినిస్ట్రేషన్ చేస్తే పెచ్చులూడి ప్రమాదం జరగకుండా ఇంకేమి సంభవిస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పాఠశాల ప్రమాదకర పరిస్థితిలో ఉన్నది. అధికారులు తక్షణమే పరిశీలించి తగు చర్యలు తీసుకోకపొతే చిన్నారులైన విద్యార్థులకు విద్యనభ్యసించే మంచి వాతావరణం లేకుండా పోతుంది. ప్రస్తుతం పిల్లలు వరండాలో కూర్చొని చదువుతున్నారు. ప్రభుత్వం ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానిక మండల విద్యాధికారిని నాడు నేడు పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి అద్వాన్న పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదటి ప్రాధాన్యత ఉన్న పాఠశాలలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వకుండా, చివరి ప్రాధాన్యత ఉన్న పాఠశాలలకు మొదటి చోటు కల్పించడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయని దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు, విషయాలు, విద్యార్థుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నైతిక విలువలకు సంబందించిన విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కోలారు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సతీష్, మండల ఉపాధ్యక్షులు కిషోర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి మోహన్, నియోజకవర్గం అభివృద్ధి కమిటి సభ్యులు సతీష్, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.