సామాన్యులకు దేవుణ్ణి దూరం చేయకండి? జనసేన పార్టీ కదిరి ఇంఛార్జ్ భైరవ ప్రసాద్

కదిరి

    కదిరి, (జనస్వరం) :  కదిరిలో వెలసియున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి  చాలా పురాతనమైన, ప్రసిద్ధి చెందిన ఆలయం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ప్రక్కన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బయట ఎన్ని క్యూలైన్లు ఉన్న ప్రధాన గర్భాలయంలోకి అందరూ సమానంగా వెళ్లి దేవుని దర్శించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు, అలాగే స్థానిక దేవాలయ కమిటీ వారు సామాన్య దర్శనం, లఘు దర్శనం అని వివిధ పేర్లతో బయటనుంచి గర్భాలయంలో కూడా దేవుని దర్శించుకునే స్థలంలో కూడా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారని, దానివలన సామాన్యుడు, డబ్బులు లేని వారు చాలా దూరం నుంచి దేవున్ని చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ గర్భగుడిలో ఉన్న విగ్రహం చాలా చిన్నది. వారికి కనపడదు. ఇలా చేసి సామాన్యునికి దేవుని దర్శనాన్ని దూరం చేయొద్దని తెలియజేస్తున్నాం. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బయటనుంచి మీరు ఎన్ని క్యూలైన్లు ఏర్పాటు చేసిన గర్భ గుడిలోకి వెళ్ళినప్పుడు దేవుని ముందర డబ్బున్న వాడు, లేనివాడు అందరూ సమానం. కాబట్టి ఏవైతే మీరు గర్భగుడిలోకి క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారో అటువంటి పద్ధతి మానుకోని పాత పద్ధతినే కొనసాగించాలని జనసేన పార్టీ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు లేఖల రూపంలో తెలియజేస్తాం. అలాగే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way