రహదారుల మరమ్మతులను చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్

జనసేన పార్టీ

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖ గౌడ్ గారి ఆదేశాల మేరకు జనసేన నాయకులు ఎమ్మిగనూరు- కర్నూలు జాతీయ రహదారిని సందర్శించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ గారు మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం కోట్లు కుమ్మరించే ఈ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మాత్రం పట్టించుకోవడం లేదని, అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మిగనూరు-కర్నూలు రహదారిపై రోజుకు వేలల్లో వాహనదారులు ప్రయాణం చేస్తారని ఇలాంటి రహదారి మరమ్మతులు చేయకుండా వదిలేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రహదారుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, కర్ణం రవి, రషీద్ తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way