విజయవాడ 51వ డివిజన్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

డివిజన్

     విజయవాడ, (జనస్వరం) : విజయవాడ 51వ డివిజన్ లో రెడ్డిపల్లి నవీన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన పోతిన మహేష్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కోరారు. అధికార పార్టీ నిద్ర మత్తులో ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు అద్వాన్నంగా ఉన్నప్పటికీ చలనం లేదన్నారు. ప్రభుత్వం అప్పులు చేయటమే లక్ష్యంగా పని చేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యల పరిష్కరానికి తను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. అనంతరం రెడ్డి నవీన్ మాట్లాడుతూ జనసేన అభివృద్ధికి, పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మదన్ కుమార్, ఎల్లారెడ్డి, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితురులు పాల్గొన్నారు.

See also  2021 MPTC And ZPTC Janasena Candidates Win List