భీమవరం, (జనస్వరం) : భీమవరం నగర అభివృద్ధి చేయాలని అని జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ కొటికలపూడి గోవిందరావు గారు మాట్లాడుతూ మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డుకి స్పందించిన సమయం ఎంతో సేపు పట్టలేదు. ఇదే శ్రద్ధ కాస్తంత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించి వుంటే బాగుండేదని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిగ్గ తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రజల తరపున పోరాడే నాయకుల నోరు నొక్కడం, నాయకుల ఇంటివద్ద పోలీసులు పహారా కాయడం, అక్కడున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు గారు తీవ్రంగా ఖండిచడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి సమస్య పరిష్కారానికి ఆ వైపుగా దృష్టిసారించాలని వైసీపీ నాయకులను కోరుతున్నాము. లేని పక్షాన మీ వైఖరి మార్చుకోకపోతే జనసేన పార్టీ తరపున పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. కేవలం ఒక ఫ్లెక్సీకు భయపడి జనసేన పార్టీ నాయకులకు 41 నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసులు ఉన్నది ప్రజల తరపున రక్షణ కాయడానికి అంతేగాని నాయకులకు చెప్పు చేతుల్లో ఉండడానికి కాదు ఇక నుంచి అయినా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నామని అన్నారు.