
ఆత్మకూరు, (జనస్వరం) : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అనంతసాగరం మండలం, మంగుపల్లి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త కానుకల శ్రీనివాస్ గారికి, ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున జిల్లా సంయుక్త కార్యదర్శి పూసల నాగమల్లేశ్వరరావు గారి ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశ పెట్టిన క్రియాశీలక సభ్యత్వం ద్వారా జనసేన కార్యకర్తలకు ప్రమాద భీమాను కల్పించారు. కార్యకర్తలకు ఎటువంటి ప్రమాదములోనైనా గాయపడిన, చనిపోయీన భీమా ద్వారా డబ్బులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు జనసైనికులతో కలసి పాల్గొన్నారు.