అవనిగడ్డ, (జనస్వరం) : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ మండలంలో, మరియు మిగిలిన 5 మండలాల్లో R&B ప్రధాన రోడ్డులు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయని, పెద్ద పెద్ద గుంటలు పడి నరకాన్ని తలపిస్తున్నాయి అని జనసేన నాయకులు అన్నారు. ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది అంటే “రోమ్ నగరం తగలబడుతుంటే రాజుగారు అంతపురంలో పిడేలు వాయిస్తున్నట్టు ఉంది. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కోలాటలు, భజనలుతో వాళ్ళ పాలన ముగించికున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాలభిషేకాలుతో అభివృద్ధి ప్రక్కన పెట్టి 26 నెలలు నుండి పాలన చేస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంచిగా రోడ్డులు వెయ్యండి అనీ కోట్లు కోట్లు నిధులు మంజూరు చేస్తే పాలకులు, కాంట్రాక్టర్ లు రోడ్డులు సరిగా వెయ్యకుండా ప్రభుత్వం ధనం జేబుల్లో వేచుకున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైస్సార్సీపీ పార్టీ, అవనీతి జరుగుతుంది అనీ ధర్నాలు, నిరసనలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి అవనీతి అంతుతెలుస్తాం అన్న నాయకులు పెదవి విప్పకుండా, పాడు అయిపోయిన రోడ్డులు బాగు చేయించకుండా గాలికి వదిలి వెయ్యటం చాలా బాధాకరం. అసలు అవనిగడ్డ నియోజకవర్గం లో R&B శాఖ ఉందా, లేదా? ఈ ప్రభుత్వంలో ఆ శాఖ తీసివేశారా? అవనిగడ్డ మండలంతో పాటు మిగలిన 5 మండలాల్లో ప్రధాన రోడ్డులు పరిస్థితి ఇలా ఉంటే అంతర్గత రోడ్డులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి నియోజకవర్గ ఎంఎల్‌ఏ గారు, అధికారులు ఈ సమస్యల పై వెంటనే స్పందించి రోడ్డులు బాగుచేయించాలి అని అన్నారు. ముఖ్యంగా అవనిగడ్డ నుండి కోడూరు వెళ్ళే ప్రధాన రహదారి రోడ్డు పరిస్థితి సామాన్య ప్రజలు ప్రయాణం చెయ్యలేని పరిస్థిలో పెద్ద పెద్ద గొయ్యాలు పడి ప్రజలు, వాహనాలు తీరగలేని పరిస్థితిలో ఈ రోడ్డు ఉన్నది. ఈ ప్రధాన మెయిన్ రోడ్డు విషయంలో అధికారులు, పాలకులు పట్టించుకోకపోతే, నియోజకవర్గం లో అన్నీ మండల ప్రధాన కేంద్రాలలో జనసేన పార్టీ ప్రజలు సహకారంతో నిరసన దీక్షలు చేస్తామని జరుగుతుంది అనీ అధికారులుకు, పాలకులకు హెచ్చిరిస్తున్నాము. వెంటనే రోడ్డులు బాగుచేయించాలి అనీ స్పందన కార్యక్రమం సందర్బంగా అవనిగడ్డ లో R&B DE వరలక్ష్మి గారిని కలిసి రోడ్డులు పరిస్థితి వివరించి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం అవనిగడ్డ MDO గారినీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప కార్యదర్శి షరీఫ్ గారు, జనసేన పార్టీ మహిళా నాయకురాలు మక్కిన విజయకుమారి గారు, బాబులు, జనసేన పార్టీ నాయకులు చెన్నగిరి సత్యనారాయణ గారు, సిద్దినేని అశోక్ నాయడు గారు, రాజనాల వీరబాబు గారు, తోట ఆంజనేయులు గారు,అన్నపరెడ్డి ఏసుబాబు, చందు, మడమల రంజిట్ కుమార్, నాంచారయ్య, ఎంపీటీసీ అభ్యర్థులు కటికల వసంత, భాను, శ్రీమన్నారాయణ, B. లోలక్షుడు, పప్పు శెట్టి శ్రీనివాస్, ప్రశాంత్, పృధ్వీ , గౌస్, పసుపులేటి రవి కుమార్, లంక రవి, తోట మురళీ కృష్ణ, బాధర్ల నాగమల్లీశ్వరరావు, తోట నాగరాజు, సోమశేఖర్ గారు,తదితరులు పాల్గొన్నారు.