కర్నూలు ( జనస్వరం ) : బనగానపల్లె నియోజకవర్గ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఆదరణ పనిముట్లను అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు అధికారుల అండతో తారుమారు చేయడం జరిగింది. బనగానపల్లె మండలంలో 800 నుండి 1000 వరకు లబ్ధిదారులు డిడిలు చెల్లించారు. కానీ వారికి అధికారులు ఆదరణ పనిముట్లను పంపిణీ చేయకుండా చేతివాటంతో అనర్హులకు ఇష్టమొచ్చినట్లు పంపిణీ చేశారు. దీనిపై బనగానపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయి ని కలసి వినతి పత్రం ఇచ్చి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరడం అయింది. దీనిపై సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయి సానుకూలంగా స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తి. సురేష్ నీలి.ప్రభాకర్, గుర్రప్ప, బోధనం ఓబులేసు, వేణురాయల్, కిట్టు పాల్గొన్నారు.