అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జనసేనపార్టీ తరపున ఆగష్టు 15న జెండా వందనం చేసి అనంతరం నిరుపేద చిన్నపిల్లలకు 100 ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. అనంతపురం జనసేన పార్టీ కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ పాల్గొని పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో ఈ భోజనం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు హర్ష, రాఘవేంద్ర, దిలీప్, సాయి జగదీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.