
అవనిగడ్డ, (జనస్వరం) : కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ వద్ద ఉన్నా ఆక్వాడేట్ ప్రస్తుతం ప్రమాదకర పరిస్థిలో ఉన్నది. ప్రకాశం బ్యారేజీ నుండి వచ్చే నీరు ఆక్వాడేట్ కు ఉన్న లీకులు ద్వారా రేవు ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి. గతంలో దివిసీమను దివ్యసీమగా మార్చటం కోసం సుమారు లక్ష ఎకరాలుకు నీరు అందించటం కోసం ఆక్వాడేట్ క్రింద 3 తొట్టిలు ద్వారా పంట కాల్వలకు నీరు అందిస్తున్నారు. దివిసీమ మొత్తం సాగు నీరు గానీ, త్రాగు నీరు గానీ ఈ తొట్టిలు ద్వారా మనకు వస్తున్నాయి. దీనికి రెండు వైపులా 2 లాక్ లు ఉన్నాయి. ప్రస్తుతం ఆక్వాడేట్ కు లీకులు ఏర్పడి ఆ లీకులు ద్వారా రైతులకు ఉపయోగపడే సాగు నీరు, త్రాగు నీరు కళ్ళ ముందు సముద్రం పాలు అవుతున్నాయి. ఈ ఆక్వాడేట్ కు ఉన్న లాక్ లకు కూడ సరి అయిన మరమ్మత్తులు చేయక పోవుట వలన వీటి ద్వారా కూడా నీరు సముద్రంలో కలుస్తున్నది. ఒక ప్రక్కన తీరప్రాంత రైతులకు నీరు అందక, నారు మదులు, వేద చల్లిన వరి పొలాలు ఎండకు నీరు లేక ఎండిపోతున్నాయి. వర్షాలు కూడ లేకపోవుట వలన కాల్వ నీరు మీద రైతులు ఆశతో ఎదురు చూస్తూ ఉంటే, ఈ ఆక్వాడేట్ మరమ్మత్తులు లేక నీరు సముద్రంలో కలవటం చాలా బాధకరం. కాల్వలు నీరు ఆపినప్పుడు ప్రభుత్వం మరమ్మత్తులకు డబ్బులు మంజూరు చెయ్యక పోవటం, అధికారులు ఈ మరమ్మత్తులు విషయంలో నిర్లక్ష్యం చెయ్యటం ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడినది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనే విధంగా ప్రస్తుత పరిస్థితి ఉన్నది. ఒక పక్క రైతులు నీరు అందక ఇబ్బంది పడుతుంటే, పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోక పోవటం బాధాకరం. దివిసీమ రైతులు బాధలు అర్ధం చేసుకోని, అధికారులు, పాలకులు వెంటనే స్పందించి వెంటనే అత్యవసరంగా ఆక్వాడేట్ లీకులు మరమ్మత్తులు చేయించి రైతులకు సాగు నీరు, త్రాగు నీరు అందించవలసినదిగా జనసేన పార్టీ నుండి కోరుచున్నాము. అధికారులు, పాలకులు పట్టించుకోకపోతే రైతులతో కలిచి ప్రజా ఉద్యమం చేస్తాము అని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము.