
జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 10వ రోజు రైల్వే కోడూరు ఎస్ ఆర్ కాలనీలో 13 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేశారు. కాలప్ప గారి రాము గారు దాతగా ఈ బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎస్ ఆర్ కాలనీ వాసులు మాట్లాడుతూ మాలాంటి పేద మహిళలను గుర్తించి మాకు ఈ బట్టలు పంపిణీ చేసిన రాము గారికి మరియు జనసేన ఎన్నారై సేవాసమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ వారు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్ గారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొండేటి భాస్కర్, చోడిశెట్టి మణి తదితర జనసైనికులు పాల్గొన్నారు.