Search
Close this search box.
Search
Close this search box.

రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి పై YCP, TDP పార్టీల కపట ప్రేమ : కొట్టే శ్రీహరి

రాజంపేట

                  TDP ప్రభుత్వ హయంలో రాజంపేట నియోజకవర్గనంను రు.870 కోట్లతో అభివృద్ధి చేశారు అంటున్నారు.  ఏమి అభివృద్ధి చేశారో దేనికి ఖర్చు పెట్టారో లెక్కలతో సహా ప్రజలకు బహిరంగంగా చెప్పలని TDP నాయకులను సూటిగా పత్రికాముఖంగా జనసేన నాయకులు శ్రీ కొట్టే శ్రీహరి గారు అడిగారు. అలాగే YCP నాయకులు కూడ రాజంపేటకు నిధులు ఎంతమేర తెచ్చి ఈ రెండు సంవత్సరాలలో రాజంపేట‌ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేశారో కూడా  చెప్పాలి. కేవలం మీ రాజకీయ భవిష్యత్తుల కోసం మీ వ్యక్తిగత ఆదాయాల కోసం పేపర్ స్టేట్ మెంట్ లు ఇచ్చుకోవడానికి తప్ప మీ రెండు పార్టీలు రాజంపేట అభివృద్ధికి చేసింది ఏమి లేదని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ మారిన రాజంపేట దినదినాభివృద్ధి చెందిన ట్రాఫిక్ సమస్య రాజంపేటలో విపరీతంగా ఉంది. ఇంత వరకూ ఈ రెండు పార్టీలు రోడ్ల విస్తరణ సమస్య పరిష్కారం కోసం కృషి చెయ్యడం లేదు. YCP,TDP పార్టీలను గెలిపిస్తున్న పాపానికి ఇక్కడ యువతకు ఉపాధి దొరక్క ఉపాధికోసం దాదాపు 40 వేలమందికి పైగా రాజంపేట నుంచి వలసలు వెళ్లారు. రాయలసీమకు తలమానికం అయిన ఆల్వీన్ పరిశ్రమ స్థానంలో ప్రత్నామ్యాయంగా పరిశ్రమ తీసుకరావడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. ఆల్వీన్ పరిశ్రమ అనేది ఈ రెండు పార్టీలు ఎన్నికల హామిగా ప్రజలకు చూపించి గెలిచక పట్టించుకోవడం లేదు. రాజంపేట ప్రజలు కేవలం గల్ఫ్ దేశల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అధికారాన్ని రెండు పార్టీ నాయకులు అనుభవించారు, అనుభిస్తున్నారు, కానీ 1000 సంవత్సరాల అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించుకోలేని స్థితిలో వున్నారు. దీని‌ని‌ అభివృద్ధి చేస్తే దాదాపు 45 కిలోమీటర్లు దూరం తిరుమల కొండకు తగ్గుతుంది. చెయ్యేరులో నీటి నిలువ కోసం చెక్ డ్యామ్ లు నిర్మిస్తాం అన్నారు. ఆ మాట నీటి మూటలాగ తయారయ్యింది. చిన్న వర్షానికి కూడా రాజంపేట నదిని తలపిస్తుంది. రాజంపేలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా వుంది. మురికినీరు ఎక్కడకి పోవాలో తెలియక రోడ్లపైన ప్రవహిస్తుంది. రాజంపేటలోని కూరగాయల మార్కెట్ ను మోడల్ మార్కెట్ ను చేస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు అయింది. ఆ మాటను ఈ నాయకులు గాలికి వదిలేశారు.
              రాజంపేటలో అభివృద్ధి నిల్ సమస్యలు మాత్రం పుల్ గా వున్నాయి. కావున రాజంపేట ప్రజలు ఇప్పటికైనా YCP, TDP పార్టీ నాయకులు నియోజకవర్గానికి చేస్తున్న మోసాన్ని గమనించి వీళ్లకు  రాజకీయ సమాధి కట్టాలని  నియోజకవర్గ ప్రజలను కోరుతున్నానని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way