
శింగనమల, (జనస్వరం) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ TC వరుణ్ గారి ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం నందు జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిని చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్రమ శిక్షణ విభాగం వైస్ ఛైర్మన్ శ్రీ P. పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి K. నాగేంద్ర, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర శేఖర్, జిల్లా సంయుక్త కార్య దర్శలు B. పురుషోత్తం రెడ్డి, D K జయమ్మ, నగర నాయకులు P. బాబు రావు గార్ల కు సన్మానం కార్యక్రమం నియోజక వర్గం నాయకులు సాకే మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినది. జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్య కర్తల సంక్షేమం కొరకు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రమాద భీమా చేసారని సామాన్యులు సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ మండల, గ్రామ స్థాయిలలో కమీటిలను నిర్ణయించి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేస్తోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో M. పెద్దిరాజు, ముని, సుమన్, ధన, ఎర్రి స్వామి, రామకృష్ణ, ప్రవీణ్, భాస్కర్, శ్రీ రాములు,రమేష్, మను రాయల్ తదితరులు పాల్గొన్నారు.