శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా 30రోజులు 30ప్రాంతాలలో 30 సేవా కార్యక్రమాలు 5వ రోజు కార్యక్రమం గుంటూరులో జరిగింది. అట్టడుగు వర్గాల మహిళల అభ్యున్నతే జనసేన లక్ష్యంగా సహాయం చేయడం జరిగింది. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు శ్రీ కుక్కంటి సుబ్రహ్మణ్యం దాతృత్వంతో గుంటూరు నగరంలోని హౌసింగ్ బోర్డు సీతమ్మ కాలనీ నందు గుడిసెల్లో నివసిస్తున్న సంచార జాతులకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. నిరుపేద మహిళలకు ఉచితంగా పంచదార, కందిపప్పు, గోధమపిండి, మినుములు, ఇడ్లిరవ్వ, పెద్ద ఉల్లిపాయలు తదితరులు 9 రకాల నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ షేక్ నాయూబ్ కమాల్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రాణం మార్కండేయ బాబు గారు, జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు శ్రీ చింతా రేణుకా రాజు గార్ల చేతులమీదుగా పంపిణీ చేశారు. శ్రీ వడ్రాణం మార్కండేయ బాబు గారు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ గారు, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్ గారు, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్ గారు, శ్రీ మాదాసు నరసింహ గారు, దండు చంద్రశేఖర్ గారు, శ్రీ మోహన్ గారు, శ్రీ కుక్కంటి సుబ్రహ్మణ్యం గార్లకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ నాయుబ్ కమాల్ గారు మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో ధన్యులని, ఈ సందర్భంగా దాత కుక్కంటి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు శ్రీ చింతా రేణుకా రాజు గారు మాట్లాడుతూ కోవిడ్ లాక్ డౌన్ నాటి నుండి నేటివరకూ అవిశ్రాంతంగా సేవలు అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఎన్నారై సేవా సమితి కువైట్ వారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు తుంగా వినోద్, బాలు, భూపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.