విశాఖపట్నం, (జనస్వరం) : బీజేపీతో ఎన్నికల విషయంలో మాత్రమే జనసేన పొత్తు అని,’సంస్థాగతమైన నిర్ణయాల్లో జనసేన స్టాండ్ ప్రజల పక్షాన వుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని శివ శంకర్ గారు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ పార్లమెంటు పొలిటికల్ అఫైర్స్ కమిటి సభ్యులు కోనతాతారావు ఆధ్వర్యములో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు శివశంకర్, విజయకుమార్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఎవడబ్బ సొత్తు కాదని, 32మంది ప్రాణ త్యాగలతో ఏర్పడిందని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితులలో విశాఖ ఉక్కుని ‘ప్రైవేటు పరం కానివ్వం అన్నారు. ఈ దీక్షలో బొలిశెట్టి సత్య, పంచకర్ల సందీప్, గడసాల అప్పారావు, కార్యదర్శి బి సత్యనారయణ, ఎలమంచిలి నియోజక వర్గం ఇంఛార్జ్ సుందరపువిజయకుమార్, జి. అప్పారావు నగర కార్యదర్శి, ప్రశాంతి మహిళ కార్యదర్శి, పితాని బాస్కర్ రావు, స్టీల్ ప్లాంటు భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు, బిఎస్ వి నర్సింగ రావు సభ్యుడు, 22వ వర్డ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్, 64న వార్డ్ కార్పొరేటర్ దల్లిగోవిందు 33వ వర్డ్ ఇంఛార్జ్ బి గోపికృష్ణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.