మత్తులో జగన్ కు ఓటువేస్తే రోడ్డు మరమ్మతులు మేము చేస్తున్నాము

రోడ్డు

        వీరవాసరం,  (జనస్వరం)  :  వీరవాసరం మండలం వీరవాసరం గ్రామంలోని మెయిన్‌ రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఉండటం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం చాలాఎక్కువగా ఉంది. వివరాల్లోకి వెళితే వీరవాసరం మండలం జనసేననాయకులు అంతా కలిసి ఆ గుంతలను కాంక్రీటుతో మరమ్మతులు చేయడం జరిగినది. మండల జనసేన ప్రెసిడెంట్‌ గుండా రామకృష్ణ గారు మాట్లాడుతూ జగన్‌ మత్తులో పడి జనం ఓట్లేసి గెలిపిస్తే రోడ్లు వేసే పరిస్థితి అటుంచి, రోడ్లకు గుంతలు పడితే వాటిని మరమ్మతులు చేసే పని చేయకపోవడం చాలా విచారకరమని వాపోయారు. సంక్షేమం పేరుతో వైయస్సార్‌ ప్రభుత్వం ఫోజులు కొడుతుంటే, క్షేమం లేని ప్రయాణాలు వాహనదారులు చేస్తున్నారని, ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే జగనన్న భీమా ఇచ్చి ఇదే సంక్షేమం అనేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బొక్కశ్రీను, బండి శ్రీను మరియు జనసేన కార్యకర్తలు మరియు తదితురులు పాల్గొన్నారు.

See also  "ఆంధ్రా అభివృద్ధి - జనసేనతోనే సాధ్యం" : మనుబోలు గణపతి