జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య : చిట్వేలి జనసేన మండల నాయకులు మాదాసు నరసింహ

జనసేన  పార్టీ

          నిరుద్యోగ యువత కోసం జనసేన పార్టీ నాయకులు  వినతి పత్రం ఇస్తామంటే అరెస్టు చేస్తారా? మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా నిలిస్తే సీఎం ఎందుకు  ఇబ్బంది  పడుతున్నాడు అని అన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చాక నయవంచనకు పాల్పడితే, నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు, జన సైనికులను గృహ నిర్భంధాల్లో ఉంచడం అప్రజాస్వామికం. జనసేన నాయకులు  చేపట్టిన జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీల్లో జిల్లా ఉపాధి అధికారికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకొంటున్నారు. నిన్న రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులకు పోలీసులు నోటీసులు ఇచ్చి వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. అర్థరాత్రి ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి, గృహ నిర్భందాలు చేయడం, కొన్నిచోట్ల పోలీస్ స్టేషన్లకు తరలించడం చేశారు. ప్రజాస్వామ్యంలో వినతి పత్రాలు ఇవ్వడం పౌరులకు, వారి పక్షాన నిలిచేవారికి ఉన్న హక్కు. దీన్ని అడ్డుకోవడం కచ్చితంగా నియంతృత్వ పోకడే అవుతుంది. 30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం, పాలకులు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలకు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తామంటే అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నమ్మి మోసపోయిన నిరుద్యోగులకు జనసేన బాసటగా నిలిచి శాంతియుతంగా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి పిలుపు ఇస్తే ముఖ్యమంత్రి ఇబ్బందిపడుతున్నారు. ఆయన చేసిన వాగ్ధానాన్ని గుర్తుచేసి అమలు చేయమంటే ఇబ్బంది కలుగుతోందా? వైసీపీ నాయకులు భారీ సభలు నిర్వహించి, ఊరేగింపులు చేసి, సన్మాన కార్యక్రమాలు చేసుకొంటే లేని ఇబ్బంది యువత కోసం జనసేన శాంతియుతంగా చేపడితే వచ్చిందా? జనసేన కార్యక్రమాలకు ఇచ్చే నోటీసులు, వర్తించే నిబంధనలు అధికార పార్టీ హంగామాలకు, కార్యక్రమాలకు ఎందుకు వర్తించవు? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంతగా కట్టడి చేసి అణచాలని చూసినా జనసేన పార్టీ నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకూ అండగా నిలుస్తుంది అని మాదాసు నరసింహ గారు  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way