జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిరుద్యోగులకు బాసటగా అన్ని జిల్లాలోని ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి నిర్ణయించడమైనది. కానీ నైతిక విలువలు లేని వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని జనసేన నాయకులను ఉదయం నుంచి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ, జన సైనికులను అడ్డుకోవటం జరిగింది. జగన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అయితే లక్షలో ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్లు దండుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పారని మాట తప్పని వ్యక్తిని వదిలేసి ప్రశ్నించిన వ్యక్తులను అరెస్టు చేయటం ఏమిటిని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖాకీస్వామ్యగా మార్చి పరిపాలన కొనసాగించాలని చూస్తున్న వైసిపి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు. రాష్ట్రంలో అరెస్టు చేసిన జనసేన నాయకులను, కార్యకర్తలలో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు షబ్బీర్, వెంకటేష్, రషీద్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.