కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో గిరిజనకాలనీలో జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. వారు మాట్లాడుతూ గ్రామములో వీధి దీపాలు సరిగా లేవని దాని వల్ల రాత్రి పూట చీకటి ఉండడం వల్ల విష పురుగులు వస్తున్నాయని, గ్రామ ప్రజలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే గ్రామములోని రైతులకు ధాన్యం బకాయిలు 3 నెలలు అయినా ఈ ప్రభుత్వం చెల్లించలేదని, దానివల్ల రైతులు అప్పులు పాలు అయ్యారని అన్నారు. అదే విధంగా మంచినీటి కుళాయిల సమస్యలు ఉన్నాయని, దళితుల కాలనీలలో ఇళ్ళమీద 11 kv కరెంటు తీగలు పోతున్నా అధికారులు పట్టించుకోలేదని, అలాగే రోడ్డుకి ఇరువైపుల కాలువలు లేవని , దాని ద్వారా మురికి నీరు ఇళ్లలోకి వస్తున్నాయని , తద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు ,జనసైనికులు మరియు గ్రామ ప్రజలు తదితురులు పాల్గొన్నారు.