ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆస్తిపన్ను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని కోరుతూ ఎమ్మిగనూరు స్థానిక పురపాలక కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి లేక వ్యాపారం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆస్తి పెంపు నిర్ణయం ఏమాత్రం అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువ. ఉన్న నిధులను పొదుపుగా వాడుకోవాలి లేదంటే ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకోవాలి. యూజర్ చార్జీలు వసూలు చేయటం మున్సిపల్ చట్టంనికి విరుద్ధమని మీకు తెలియదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్తపై యూజర్ చార్జీలు ప్రతిపాదనను ఆమోదించడం సిగ్గుచేటు అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉండే పెడన పట్టణంలో యూజర్ చార్జీలు ప్రజలకు అదనపు భారం అవుతాయి. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన బడుగు జీవులపై ఇలాంటి పనులు విధించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా ఆస్తి పనులను రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా 0.15 శాతం గృహాలకు, 0.30 శాతం వాణిజ్య సముదాయాలకు పెంచుతామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్టణ ప్రజలకు మరింత భారం మారనున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో, రవిప్రకాష్, రషీద్, వెంకటేష్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.