పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం అయిన ఓగిడి, అయినపర్రు, చెరుకువాడ, సత్యవరం, పెనుగొండ, జలచెరువు మరియు కాకిలేరు మీదుగా పెనుగొండ మైనర్ డ్రైనేజీ మురుగు కాలువ సుమారుగా 5 కిలోమీటర్ల డ్రెయినేజీ ఉంది. దీనివల్ల ఓగిడి అయినపర్రు 300 ఎకరాల భూమి మొత్తం, సుమారుగా 800 ఎకరాల్లో పంట పొలాలు ఈ డ్రైనేజీ వల్ల పంటల మునిగిపోవటం రైతాంగం నష్టపోవడం జరుగుతుంది. UT సైపాండ్ తనే లు 1876 బ్రిటిష్ వారి కాలంలో కట్టినది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరమ్మత్తులు గానీ దాన్ని, బాగుచేయక పోవడం వల్ల రైతాంగం చాలా నష్టపోతుందని స్థానిక రైతులు, జనసేన నాయకులు అన్నారు. గతంలో కూడా రైతాంగం అంతా కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. అయినా కూడా కూడా ఇప్పటికీ కూడా ఈ డ్రైనేజీ ని బాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల రైతాంగం చాలా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తక్షణమే ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుని రైతాంగాన్ని అందరిని ఆదుకోవాలని కోరుకుంటున్నామని ఆ ప్రాంతాన్ని పరిశీలించిన స్థానిక జనసేన నాయకులు కోరారు. అలాగే UT డ్రైనేజీ తనేలు 1876 సంవత్సరం బ్రిటిష్ కాలం నాటిది దీని ఎత్తు పెంచి కాల్వ మొత్తం క్రేన్ తో తవ్వించి మురుగు నీరు లేకుండా వెళ్లి అలా చేయాలని రైతాంగం కోరుతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా తవ్వినా దాని ఉపయోగం లేని పరిస్థితి దయచేసి ప్రభుత్వం వారందరూ కూడా దీన్ని దృష్టి తీసుకోవాలని కోరుకుంటూ రైతులు ఈ కార్యక్రమంలో కట్ట బుల్లయ్య, కానూరి సత్యనారాయణ, కానూరి రవికుమార్, గంట అప్పారావు, కడలి సూర్యనారాయణ, దొంగ శ్రీను, దొంగ వెంకటేశ్వరరావు, దొంగ మారియా, బండి సాయిబాబా, నీలం రాజారావు, సత్తి శ్రీ రామ్ రెడ్డి, దొండ సూర్యనారాయణ, ఏసుబాబు, గుత్తుల శంకరం, గుత్తుల నరసింహమూర్తి, పెచ్చెట్టి నాగేశ్వరరావు, దాసరి రాముడు, దొండ చిన్న కాపు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.