తెలుగు అకాడెమీ పేరు మార్చి సాధించే ప్రయోజనం ఏమిటి? జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

         సంస్కృత భాష అభివృద్ధి  కోసమైతే ప్రత్యేక అకాడెమీ ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయి. తెలుగు భాష అభివృద్ధి కోసం, విద్యా విషయకంగా తెలుగు వినియోగంకోసం కృషిచేయాల్సిన అకాడెమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారు. తెలుగు మరియు సంస్కృత అకాడెమీ అని ఎందుకింత హడావిడిగా మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడెమీ బాధ్యులు ప్రజలకు వివరణ ఇవ్వాలి. పేరు మార్చడం ద్వారా సాధించే ప్రయోజనం ఏమి ఉంటుంది. ఇంటర్మీడియెట్‌, డిగ్రీ  విద్యార్ధులకు తెలుగు అకాడెమీ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటూ వచ్చాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సైతం ఈ పుస్తకాలనే ఎంచుకొంటారు. తెలుగు భాషకు సంబంధించి పలు నిఘంటువులు, వృత్తి పదకోశాలు ఈ అకాడెమీ ద్వారా వచ్చాయి. అకాడెమీ ద్వారా భాషాభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఆ విషయాన్ని విస్మరించి అకాడెమీ పేరు మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా? అకాడెమీకి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడంతో అక్కడి కార్యకలాపాలు కొంత కాలం నుంచి నిస్తేజంగా ఉన్నాయి. సంస్కృత భాష అభివృద్ధి కోసమే పేరు మార్పు అనుకొంటే ప్రత్యేకంగా సంస్కృత అకాడెమీ ఏర్పాటు చేయవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం అధ్వర్యంలో ఉన్న సంస్కృత అకాడెమీలాంటిది ఇక్కడా ప్రారంభించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అకాడెమీ పేరు మార్పు నిర్ణయాన్ని పునపరిశీలించాలి. తెలుగు అకాడెమీ అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలుగు భాషాభిమానులు, భాషాశాస్త్రవేత్తలు ముందుకు రావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way