తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలోని అర్జనుడిపాలెం గ్రామంలో జరిగిన రైతు సదస్సులో తమ వద్ద కొన్న 11 ఎకరాల ధాన్యం డబ్బులు ఇవ్వవలసిందిగా విల్లూరి సుబ్బారావు అనే రైతు తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును నిలదీస్తే ఆ రైతును పోలీసులతో గెంటించివేసిన ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు చేసిన ఘటనకు మొత్తం మండలం రైతులందరికీ క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు అనుకుల రమేష్ డిమాండ్ చేశారు. అదే విధంగా రైతుల వద్ద కొన్న ధాన్యం డబ్బులు తక్షణమే తిరిగి చెల్లించాలని, ఖరీఫ్ సీజన్లో ఎరువులు పురుగుమందులు తక్కువ ధరకు అందించాలని తెలిపారు. ఈ విషయంపై తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో పాల్గొన్న అర్జనుడిపాలెం ప్రెసిడెంట్ పోతుల గంగాధరం, వార్డు మెంబర్లు, కానూరి మాధవ రాయుడు, రైతులు ఓసారి వెంకట్రావు, పిండి శ్రీనివాస్, మల్లిపూడి రామకోటి, బొర్రా విష్ణు, గడిగొయ్యల వెంకట్రావు, మల్లిపూడి గణపతి, విల్లూరి సూర్యారావు, రాచకొండ సత్యనారాయణ ఇరగవరం మండల రైతులు, జనసేన నాయకులు జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.