
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందని రైల్వే కోడూరు జనసేన పార్టీ జనసైనికులు గంధంశెట్టి దినకర్ బాబు గారు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేదా అన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం రాష్ట్రానికి 2020 – 21 సంవత్సరానికి లక్ష కోట్ల పైన లోటు బడ్జెట్ దాటినా అభివృద్ధి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్య ధోరణిలో ఉంచేశారన్నారు. ప్రభుత్వ రాబడి నవరత్నాలకు, వడ్డీ చెల్లింపులకు, జీతభత్యాలకు సరిపోని పరిస్థితులలో కత్తి మహేష్ కి ప్రభుత్వము 17 లక్షలు రూపాయలు ఎలా బదిలీ చేస్తారు అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇల్లు కట్టుకునే సమయానికి పెరిగిన ధరలుతో కట్టుకోలేని వారిని, తిరిగి ఇళ్ల స్థలాలు ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాల్సిందిగా కొద్దిమంది అధికారులు ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసుల సహకారంతో పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనం వహించడం తెలంగాణలో గల రాజకీయ నాయకుల ఆస్తుల కాపాడుకోవడం కోసమేనా అని నిలదీశారు. కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసిన పులిచింతల ప్రాజెక్టును ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం తన కార్యాచరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.
,