
కావలి నియోజక వర్గం, దగదర్తి మండలం మనుబోలు పడులో ఇళ్లు కాలిపోయిన వారికి, వాళ్ళు అడిగిన విధంగా వంట సామానులు జనసేన పార్టీ కావలి ఇంచార్జి అళహరి సుధాకర్ గారూ పార్టీ తరపున అందించడము జరిగింది. ఆ ఇంటి ఇల్లాలుకి జీవనోపాధి అయిన కుట్టు మిషను కూడా కాలిపోవడముతో మరో రెండు రోజులలో వారికి కుట్టు మిషను కూడా అందిస్తానని హామీ ఇవ్వడము జరిగింది. ఈ సంధర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ ఇంత వరకూ అధికార పార్టీ, ప్రభుత్వం నుండి వాళ్ళకు ఎటువంటి సహాయము అందక పోవడము శోచనీయమని అన్నారు. ఇప్పటికి అయినా వారికి అదే స్థలములో ఇళ్ళు నిర్మించి ఇవ్వాల్సిన భాధ్యత YCP నాయకుల మీద ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నురుద్దిన్, YVP రెడ్డి, వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.