బాపట్ల నియోజకవర్గంలోని 3 మండలాలు & పురపాలక సంఘ పరిధిలో సుమారు 150 వెంచర్లు ఉండగా కేవలం ఏడు వరకు మాత్రమే అనుమతి ఉండటం ఆశ్చర్యకరం. భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న కనీస చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు. ఈ విధమైన అనధికార వెంచర్ల వలన ప్రభుత్వము మరియు ప్రజలు నష్టపోతున్నారు. ఎక్కువ మొత్తంలో ముడుపులు ప్రభుత్వ అధికారులు & ప్రజా ప్రతినిధులు చేతులు మారడం వల్ల సెంటు భూమి కి 70 వేల రూపాయల నుండి లక్షరూపాయల వరకూ ప్రజలపై భారం పడుతుంది. ఇకనైనా మమ్మల్ని ఎవరూ చూడట్లేదు, ఎవరూ పట్టించుకోరు మేము ఏం చేసినా కానీ, ఏది చెప్పినా గానీ చెల్లుతుంది అని అనుకునే ప్రభుత్వ అధికారులు & ప్రతినిధులు కళ్ళు తెరిచి దీనిపై స్పందించి అక్రమ లేఅవుట్లు పై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. నెల రోజుల వ్యవధిలో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోని ఎడల న్యాయపరమైన పోరాటానికి తగిన ఆధారాలతో సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వెంకట శివన్నారాయణ గారు, పట్టణ నాయకులు ఆరమల్ల సుజిత్ గారు, ఆదిశేషు గారు ప్రసాద్ గారు, కొట్రా మణికంఠ గారు , పవన్ గారు , జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.