ఐపిసి ని ప్రక్కన పెట్టి వైసీపీకి బానిసలుగా మారుతున్న జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం : జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు

వైసీపీ

        విజయనగరం జిల్లాలో ఐ.పి.సి. ని ప్రక్కన పెట్టి వైసీపీ కి బానిసలుగా ఇటు జిల్లా అధికారులు, అటు జిల్లా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు ఆరోపించారు. కలక్టరేట్ ముందు హైకోర్టు ఆదేశాలను, ప్రభుత్వ అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి, ధిక్కరించిన వైస్సార్సీపీ నాయకుల ఆగడాలకు నిరసనగా కోవిడ్ నిబంధనలతో శాంతి యుతంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధికార పార్టీకి చెందిన నాయకులు వారి స్వార్ధం కోసం మండల, గ్రామ స్థాయి నాయకులను కోర్టు ఆదేశాలను, అధికారుల ఆదేశాలను ప్రక్కన పెట్టి నియంతల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా రెవెన్యూ పరిధిలోను మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూములపై చెట్లను నరికివేత, అక్రమ నిర్మాణాలను చేయడాన్ని ప్రశ్నించిన ప్రజలపై దౌర్జన్యాలు చేయడం, అడ్డొచ్చిన అధికారులపై ఎమ్మెల్యే లకు ఫోన్లు చేసి జిల్లా అధికారులను బెదిరించడం మొదలగు సంఘవిద్రోహ చర్యలు చేస్తున్న ఎల్.కోట మండలం, చందులూరు గ్రామంలోను, విజయనగరం మండలం, తోటపాలెం, వైయస్సార్ నగర్ కాలనీలోను, కొత్తవలస మండలం చింతలదిమ్మ ఘటన లపై కోర్టు ఆదేశాలు ఉన్నా.. గతంలో జిల్లా అధికారులకు, మండల అధికారులు చర్యలు తీసుకోలేదు. పైగా విఆర్వో స్థాయి వ్యక్తులకు లంచాలు ఇచ్చి తప్పుడు నివేదికలు సర్వే నెంబర్లు మార్చడం ద్వారా సమస్యలను పెంచుతూ పోతున్నారని దుయ్యబట్టారు.

          చందులూరు గ్రామానికి చెందిన ఎం.పి.పి.పాఠశాలను రైతుభరోసా కేంద్రానికి ఇచ్చారని, దీనికి వ్యతిరేకంగా గ్రామ ప్రజలు కోర్టుకు వెళ్లగా హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినను స్టే ఆర్థర్ కోర్టు లో ఉందని ఆలోచించకుండా ఎటువంటి, ఎం.ఆర్.ఓ., మండల అధికారుల ఆదేశాలు లేకుండానే టేకు చెట్లను నరికివేసినారు. చందులూరు గ్రామస్తులంతా ఎం.ఆర్.ఓ మరియు పోలీసు వారికి ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నాయకులకు భయపడి ఇటు అధికారులు, అటు పోలీసులు ఐ. పి.సి. ని ప్రక్కన పెట్టి,వైసీపీ కి బానిసలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) భాస్కర్, జొయ్, మరియు చందులూరు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way