
రాజంపేట ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి అని జనసేన పార్టీ ఆధ్వర్యంలో డా.బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జనసేన యువ నాయకులు చెంగారి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. రాజంపేట మెడికల్ కాలేజీ రాజంపేట ప్రజల హక్కు అని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది అని జనసేన యువ నాయకులు చెంగారి శివ ప్రసాద్ తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి మెడికల్ ఏర్పాటు చేస్తాము అని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెప్పి ఇప్పుడు మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రకటన విషయంలో రాజంపేట పేరు ప్రకటించకపోవడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలని పరిగనిలోకి తీసుకోకుండా ఆగౌరవ పరిచారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఇక్కడ ప్రజలలు ఆరోగ్య పరంగా ఇతర ప్రాంతాల ఆసుపత్రిలకి వెళ్లి దోపిడీకి గురి అవ్వుతున్నారు అని అన్నారు. సరైన సమయంలో చికిత్సలు అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. మెడికల్ కాలేజీ సాధించేంత వరకు ప్రజల పక్షాన నిలబడి జనసేన పార్టీ పోరాటం చేస్తుందని శివ ప్రసాద్ గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జనసేన నాయకులు కత్తి సుబ్బారాయుడు, పలుకురి శంకర్, మల్లికార్జున, సూరిబాబు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.