ఆస్తిపన్ను,యూజర్ చార్జీలు, వెంటనే రద్దు చెయ్యాలి అని జనసేన కార్పొరేటర్లు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన

ఆస్తిపన్ను

           పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నుల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. పన్నుల భారం తప్పించండి అని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. జనసేన కార్పోరేటర్లు పీతల మూర్తి యాదవ్, దల్లి గోవింద్ రెడ్డి, బీశెట్టి వసంత లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో జనసేన పార్టీ PAC సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర నాయకులు సుందరపు విజయకుమార్ ,ఉషా కిరణ్ పసుపులేటి, Dr. సందీప్ పంచకర్ల, గోపికృష్ణ  GK ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువ ఆధారిత వన్నుల పెంపు కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 198 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు పలు హామీలు ఇచ్చి స్థానిక ఎన్నికలు అవ్వగానే వైకాపా నిజస్వరూపం బయటపెట్టుకుందని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి వైకాపా కార్పొరేటర్లు కూడా ఇంటి పన్నుల పెంపు, యూజర్ ఛార్జీలు విధింపు పై పోరాడాలని పిలుపునిచ్చారు. కరోనాతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న సమయంలో పన్నులు తగ్గించి ఊరటనివ్వాల్సింది పోయి ఇలా దొంగ దెబ్బ తీయాలని ప్రభుత్వం ప్రయత్నం చేయడం దారుణం అని వాపోయారు. 58 మంది కార్పోరేటర్లను గెలిపించినందుకు వైసీపీ నాయకత్వం విశాఖ పరాజయాలకు పన్నుల భారాన్ని కానుకగా ఇస్తోందని ఎద్దేవా చేశారు. అద్దె బట్టి పన్ను విధానం మాని మార్కెట్ విలువ ప్రకారం పన్ను వెయ్యాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ అంటే కనీస గౌరవం లేకుండా కార్పోరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తున్న వైసీపీ ప్రభత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఆస్తి పన్ను,యూజర్ చార్జీలు వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. లేదంటే జనసేన ఆధ్వర్యంలో మరింత ఉదృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way