కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి : ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖ గౌడ్

కాంట్రాక్టు

        ఎమ్మిగనూరు మాచాని గంగప్ప ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరిడెంట్ బాలయ్య గారితో నియోజవర్గ ఇంఛార్జ్ రేఖ గౌడ్ గారు మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు నెలలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు మరియు అవుట్ సోర్సింగ్ విభాగంలో కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నేటికి 10 నెలలుగా వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం నుంచి కనీసం వారికి ఒకనెల జీతం కూడా అందకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయని వైద్య వృత్తిలో పనిచేస్తున్న వారి జీతాలు పెండింగులో పెట్టడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగుల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం దారుణమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో ఉచిత సేవలు చేయించుకుని జీతాలు చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా కృషిచేయాలని జనసేనపార్టీ ఆధ్వర్యములో సూపరెండేంట్ మరియు ఆసుపత్రి ఇంఛార్జీల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని 10 నెలలుగా జీతాలు చెల్లించకున్న వారి విధులు బాధ్యతతో నిర్వహించిన స్టాఫ్ నర్సులకు 10 నెలల పెండింగ్ జీతాలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో  భాష, రాహుల్ సాగర్, షబీర్, రవి, రవిప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way