
శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మలి మండలం, భావనపాడులో టెక్కలి జనసేన ఇంఛార్జ్ కణితి కిరణ్ పర్యటించారు. ఇటీవల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్త చీర్ల ఎర్రన్న, బయ్యి జోగులు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున తమ పూర్తి సహకారాలు ఉంటాయని కిరణ్ గారు తెలిపారు. నియోజకవర్గములో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని ఈ సందర్బంగా అని అన్నారు. ఈ పర్యటనలో టెక్కలి నియోజకవర్గ నాయకులు పూర్ణచంద్ర,సాయి మహంతి,స్వాదీన్, మరియు భావనపాడు జనసేన నాయకులు రమేష్, బై సంతోష్,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.