
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, ఆర్కేవిబి పేట గ్రామ పంచాయతీ, ఇందిరా కాలనీ మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్న సర్వే నెంబర్ 164/1 లో 1.42 సెంట్లు ప్రభుత్వ భూమి (కుంట /బావి) ని నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పధకంలో ఇళ్ల స్థలాలు కేటాయించారని జనసేన పార్టీ ఇంచార్జ్ యుగంధర్ పొన్న తెలిపారు. ఇదివరకే ఇక్కడ కోనేరు ఉండేదని, ఒక రైతు ఈ స్థలం మీద కోర్టులో కేసు వేశారని తెలియజేసారు. కుంటను గుట్టగా మార్చడం ఏమిటని, పేదలకు నష్టం తప్ప మరేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయ నాయకులను సంతోష పెట్టవద్దని, పేద ప్రజలకు న్యాయం చేయాలనీ ఎద్దేవా చేసారు. ఒక్కప్పడు 60 కుటుంబాలకు చెందిన పశువులకు ఇక్కడ నీళ్ల కుంటగా ఉండేదని తెలిపారు. నిరుపేదలైన వారికీ మేలు చేయాలంటే కుంటలో ఇళ్ల స్థలాలు కేటాయించడం కాదు, వారికీ ప్రభుత్వమే నివాసయోగ్యమైన ఇళ్ల స్థలం కొనుగోలు చేసి వారి జీవితంలో వెలుగును నింపాలని కోరారు. ఇలా చేయక పొతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ కూడా నివాస యోగ్యమైన స్థలం లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కుంట, బావిలో ఇవ్వకూడదని తెలియజేసారు. కాబట్టి రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి నిరుపేదలైన కుటుంబాలకు స్థలం కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించి, ప్రస్తుతం కేటాయించిన కుంట/బావిని రద్దు చేయాలనీ తెలియజేసారు. అనేక మార్లు దీనిని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త రాఘవ, జనసేన నాయకులు శివ, శివ కుమార్, కిషోర్, అశోక్, వినోద్ ఉన్నారు.