జగ్గయ్యపేట పట్టణంలోని కొలిమిబజారుకు చెందిన ముత్యాల గిరిజమ్మ అనే మహిళకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు మే 12 న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అయితే 15 వ తేదీన గిరిజమ్మ మరణించిందని మృతదేహాన్ని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. వారు వెంటనే దహన సంస్కారాలు చేశారు. అయితే బుధవారం గిరిజమ్మను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. దీంతో ఆమె ఆటోలో ఇంటికి వచ్చేసరికి స్థానికులు హతాశులయ్యారు. చనిపోయన ఆమె ఎలా తిరిగొచ్చిందని భయభ్రాంతులకు గురయ్యారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది తెంపరితనంపై ప్రతి ఒక్కరు పెదవి విరుస్తున్నారు. ఎవరు చనిపోయారో కూడా తెలియకుండా మృతదేహాన్ని ఎలా అప్పగించారో ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మరణించిన శరీరం ఎవరిది వారి కుటుంబ సభ్యులు ఎవరు వారికి ఏ విధంగా ఈ విషయాన్ని తెలియచేస్తారు ఇలా పలు ప్రశ్నలకు సమాధానం అదే విధంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్షంపై తక్షణమే స్పందించి సంబంధిత అధికారులు చేత దీనిపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నట్లు జగ్గయ్యపేట మండల తహశీల్ధార్ వారికి వినతిపత్రం అందించారు. అదే విధంగా మానవ హక్కుల సంఘం చైర్మన్ గారు అందుబాటులో లేని కారణంగా ఫోన్ ద్వారా ఆయనకు ఈ విషయాన్ని తెలియచేసాము అని ఆయన తెలిపారు. మరొక్కమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి తరుపున నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాము అని జనసేన నాయకులు ఈమని కిషోర్ అన్నారు.
ఇవి కూడా చదవండి :
కోవిడ్ టెస్టింగ్ సెంటర్ మార్చండి : రైల్వేకోడూరు జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్
మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here