జనసైనికుడు యెర్రంశెట్టి హరిబాబు జన్మదిన సందర్భంగా రాజంపేటలో కరోనా బాధితులకు చిరు సహాయం

జనసైనికుడు

             జనసేనాని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజంపేట వాస్తవ్యుడు ఉద్యోగరీత్యా కువైట్ లో నివసిస్తున్న జనసైనికుడు, జనసేన ఎన్నారై కువైట్ సేవాదళ్ సభ్యుడు అయిన యెర్రంశెట్టి హరి బాబు జన్మదిన సందర్భంగా రాజంపేట పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో నోడల్ ఆఫీసర్ సురేష్ గారి సూచన మేరకు నలభై మంది కరోనా పేషంట్స్ కు పండ్లు , డ్రై ఫ్రూట్స్ అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట జనసేన నాయకులు కరోనా రోగులతో మాట్లాడి వారికి అన్ని వసతులు కల్పించారని, పౌష్ఠికాహారం ఇస్తున్నారు అని చెప్పగా రాజంపేట జనసేన పార్టీ తరపున అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా పేషెంట్లు వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ త్వరగా కోలుకోవాలని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఎర్రంశెట్టి హరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ రాజంపేట మండల అధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు గారు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అయి ఉండి కరోనా సెకండ్ వేవ్ లో చాలా మందిని కోల్పోయామని మూడవ వేవ్ వస్తున్న తరుణంలో రాజంపేటలో యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలసాయి కృష, కత్తి సుబ్బరాయుడు , తాళ్ళపాక శంకర, అదెయ్య తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి :

కోవిడ్ టెస్టింగ్ సెంటర్ మార్చండి : రైల్వేకోడూరు జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్

 

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way