తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గం నుంచి జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి వారి కుటుంబము ఎన్నో ఏళ్లుగా బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తదాన, వైద్య, ఆక్సిజన్ సేవలు కులమతాలకు అతీతంగా ప్రారంభించి, అనేక మందికి సేవలు చేస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్న కొన్నివేలమందికి ప్రాణం పోసిన గొప్ప శక్తిగా, ప్రాణదాతగా చిరంజీవి చిరస్థాయిగా నిలిచిపోతారని బండారు శ్రీనివాస్ ఎంతో ఆనందభాష్పాలతో సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పుడు రాష్ట్రంలో 30 కోట్లతో అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ, ముఖ్య పట్టణాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణపు పనులను, ప్రారంభోత్సవ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లోవెంటనే ఆక్సిజన్ సరఫరా అందుబాటులోకి వస్తే మరికొంత మందిని, ప్రాణాలను నిలబెట్టిన వారవుతారని అన్నారు. ఈ మహాయజ్ఞానికి ఎటువంటి ఆటంకం కలగకుండా వెంటనే పేదలకు, కరోనా రోగులకు ఆక్సిజన్ సేవలు అందించాలని భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి అందరివాడిని, చిరంజీవి కుటుంబం, జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటివారిని ప్రజలు అందలం ఎక్కించకపోయినా కూడా, ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల ప్రజల గురించి బాధ పడలేదని, కొంతమంది కుల రాజకీయాలు కుట్రల మూలంగా ప్రజలను కంటికి రెప్పలా కాపాడే మంచి మనసున్న మెగా ఫ్యామిలీ కుటుంబాన్ని, ప్రజలుఆదరించక పోవడం తెలుగు రాష్ట్రాల ప్రజల దురదృష్టంమని అన్నారు. ఈ రోజున చిరంజీవి చేపడుతున్న ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాట్లు నిరుపేద అనారోగ్య వంతులకు, కరోనా రోగుల పట్ల ఒక సంజీవని లాగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రాణాలను కాపాడుతుందని, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, జనసైనికులు బండారు శ్రీనివాస్ ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో జనసేనానికి, మెగాస్టార్ ఫ్యామిలీ కుటుంబానికి ప్రజలు అందరూ సహకరించాలని, ఒక్క అవకాశాన్ని ప్రజలు పవన్ కళ్యాణ్ కు ఇచ్చి మెగాస్టార్ ఫ్యామిలీకి, వారి కుటుంబానికి న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నానని, కొత్తపేట నియోజకవర్గ జనసైనికులు బండారు శ్రీనివాస్ తెలియజేసియున్నారు. అదేవిధంగా సమాజ సేవలోనూ, నిరుపేదలకు కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న మెగా ఫ్యామిలీ కుటుంబానికి, అవినీతి మచ్చలేని జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రెస్, మీడియా సంస్థల సహకారం ఎంతో కావాలని కోరుకుంటున్నామన్నారు.
ఇవి కూడా చదవండి :
కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here