బాపట్ల నియోజకవర్గ జనసేన వీరమహిళ గుంటుపల్లి తులసి కుమారి గారు మాట్లాడుతూ ప్రజలకు 45 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ లో అతి తక్కువ మందికి వ్యాక్సిన్ లు వేయడం జరుగుతుందని, అదికారపార్టీ పార్టీ వారికి మాత్రమే ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కడ అధికారపార్టీ నాయకులను సంప్రదించి వారిని బ్రతిమాలికుంటేనే తప్ప వ్యాక్సిన్ వేయడం లేదని, దానికి ఒక చిన్న ఉదాహరణ నిన్న బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో జరిగిన సంఘటన. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ల వరకు మాత్రమే పార్టీల మద్య పోటీలుంటాయి. ఎలక్షన్ తరువాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం అందరిని సమానంగా చూడాలి. అందరినీ ఒకే దృష్టితో చూసి వ్యాక్సిన్ సరఫరా చేయాలని, అంతేకాకుండా తక్కువ మందికి వ్యాక్సిన్ అందచేయడం వలన పరిస్థితి మన అదుపులో ఉండదు కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ సరఫరా చేయాలని, వ్యాక్సిన్ సరఫరాలో ఎటువంటి స్వార్ధపూరిత రాజకీయాలు చేయరాదని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున హెచ్చరించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం ల పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే వీరి దగ్గర అవసరమైన పల్స్ మీటర్, థర్మల్ మీటర్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ కరోనా కిట్లు వారి దగ్గర లేకపోవడం వలన మరింత సమయం వృథా అవ్వడమే కాకుండా, ఈ లోపు మరింత వ్యాప్తి చెందుతోంది. ఒకవేళ బయట కొందామంటే బ్లాక్ మార్కెట్ దందా దారుణంగా నడుస్తోందన్నారు.ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అవసరమైన కరోనా కిట్లు అందించకుండా కరోనా పై యుద్ధం చేయమనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం ఫీవర్ సర్వే వాలంటీర్ల ద్వారా చేయిస్తోందని అబద్ధపు బూటకపు నాటకం ఆడుతోంది. వాలంటీర్లుకు ఇప్పటి వరకూ థర్మల్ స్క్రీన్లు ఇచ్చింది లేదు. అలాంటప్పుడు వారు ఫీవర్ సర్వే ఎలా చేస్తారని ధ్వజమెత్తారు. కరోనా వచ్చిన వారిలో సగం మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో లేదట, ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షలు ధారపోయాలాట అనే వార్తలతో భయభ్రాంతులకి గురవుతున్నారు. కావున ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన పార్టీ తరుపున ప్రతి గ్రామంలో కూడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి, సరైన వసతులు కల్పించాలని కోరుతున్నాము. గ్రామాల్లో ఏఎన్‌ఎం ల సేవలు ఈ సమయంలో చాలా అవసరమైనవి అని వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాము.
ఇవి కూడా చదవండి :
కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here