ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని గంగప్ప ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల కొరతతో గ్రామీణా ప్రాంతాలకు చెందిన నిరుపేద ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ఎమ్మిగనూరు జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సూపరెండెంట్ బాలయ్యకు అందించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలే కాకుండా మంత్రాలయం, నందవరం,మండలాల నుంచి దాదాపు 5 లక్షల జనాభా పరిధిలో ఉన్న అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలలో 100 బెడ్ లకు 84 పోస్టులు ప్రభుత్వం కల్పిస్తే వాటిలో కేవలం 44 మంది వైద్యులు మాత్రమే ఉండగా మిగిలిన అన్ని రకాల ఉద్యోగులు 40 మందికి సంబంధించిన పోస్టులు ఖాళీగా వున్నాయని అన్నారు. సత్వరమే భర్తీచేసి పేద ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దాదాపు 5 లక్షల జనాభా పరిధిలో ఉన్న వైద్యశాలలో కేవలం 9 మంది వైద్యులు మాత్రమే వైద్యం అందించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వివిధ రోగాల బారిన పడిన గ్రామీణప్రాంత ప్రజలు నిత్యం రద్దీగా వుండే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సమయానికి వైద్యం అందక వైద్యులు అందుబాటులో ఉండక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగానే కాంట్రాక్టు, స్టాఫ్ నర్సులకు 9 నెలల నుంచి జీతాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఇలాంటి కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్, ప్రవేట్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది స్టాఫ్ నర్సులకు 9 నెలల జీతాలు చెల్లించక పోవడం సిగ్గుచేటన్నారు. కరోనా బారిన పడితే ఆ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే కొందరు కరోనా బారినపడి పూటగడవని పరిస్థితిని ఎదుర్కోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. వైద్యశాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఖాళీలను భర్తీ చేసి స్టాఫ్ నర్సులకు పెండింగ్ జీతాలు చెల్లించేలా కృషిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు షబ్బీర్, వినయ్, పుల్లన్న, రషీద్, వెంకటేష్, శివ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here