వైసీపీ పాలనలో రైతులు భరోసా కోల్పోయారు
👉🏻 ధాన్యానికి మద్దతు ధర ఏదీ?
👉🏻 దళారుల దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది
👉🏻 మద్దతు ధర రూ 1416 ఉంటే మిల్లర్లు రూ 1100 కే కొంటున్నారు
👉🏻 తడిసిన ధాన్యం కొనే నాథుడు లేడు
👉🏻 రైతు భరోసా కేంద్రాలు మీ బొమ్మల ప్రచారానికేనా?
👉🏻 ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోళ్లు ప్రారంభిస్తుంది?
👉🏻 వ్యవసాయ బడ్జెట్ మరో బూటకం
👉🏻 రూ 11,210 కోట్లలో రైతులకిచ్చిన పరిహారం రూ 20 కోట్లు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు కనీఇస భరోసా కల్పించడంలో విఫలమయ్యిందని పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ గారు పత్రికా ముఖంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రకటనలకు కేవలం ప్రకటనలకే కాగితాలకే పరిమితం అయిపోయాయి. రైతు భరోసా కేంద్రాలు అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నారు, అవి ఎక్కడ ఉన్నయో రైతులకు తెలియడం లేదు. పెడన నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అమ్మబోతే అవి కొనబోతే కొరివి అన్నట్లు తయారయ్యింది. చేతికందిన పంట నోటికి అందని పరిస్థితి. ఆరుగాలం కష్ఠించు పండించిన పంట అమ్ముదామంటే కనీసం పెట్టిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనపడడం లేదు. రైతుకి కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. దళారుల రూపంలో ఉన్న మిల్లర్లు వంకలు చెప్పి అడ్డగోలుగా ధరలు నిర్ణయిస్తున్నారు. యంత్రాల సాయంతో కోత కోసిన ధాన్యానికి మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.300 తక్కువ చేసి కొంటున్నారు. ధాన్యం మెుత్తం బాగున్న మద్దతు ధర ఇవ్వడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం 75 కేజిల బస్తా 1416 రూపాయలు కాగా స్థానిక మిల్లర్లు రూ.1100 నుంచి రూ.1200కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దళారులు అంతా అడ్డంగా దోచుకుంటున్నా సంబధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఓ వైపు కరోనా మహామ్మరి విరుచుకుపడుతుంటే అదే అదునుగా దళారులు రైతుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు.
ఆర్బాటంగా పార్టీ రంగులు, ముఖ్యమంత్రి గారి బొమ్మలు అద్ది రైతు భరోసా కేంద్రాలు అంటూ ప్రారంభించారు. ఆ రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఏం భరోసా లభిస్తోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతు భరోసా కేంద్రాలు కేవలం వైసీపి ప్రచార కేంద్రలుగా మిగిలిపోయాయి. ఇప్పటికే మీరిచ్చే రైతు భరోసాలో ఏటా చిల్లు పెడుతున్నారు. కనీసం ధాన్యానికి మద్దతు ధర కల్పించలేని మీ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. రంగు బాగున్న ధాన్యం పరిస్థితి ఇలా ఉంటే కొంచెం రంగు వచ్చిన, తడిసిన ధాన్యం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. అన్నదాతను అదుకోవాలి. ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి. తడిసిన ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర కల్పించాలి. వ్యవసాయ బడ్జెట్ అంటూ ప్రత్యేకంగా రూ 11,210 కోట్లతో ప్రవేశ పెట్టారు. ఇందులో రైతులకు పరిహారంగా చెల్లించే మెుత్తం కేవలం రూ.20 కోట్లు,ధరల స్థిరీకరణ మిది అంటున్నారు. దళారులు దోచుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికి రాష్ట్ర బడ్జెట్ లో కలిపి చూపించు వ్యవసాయ మంత్రి అంకెల గారడీ చేశారు. గత ఏడాది నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇఙత వరకు పరిహారం అందలేదు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి డిమాండ్ మేరకు ప్రతి రైతుకీ రూ.30 వేల నష్ట పరిహారం అందించాలి. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పక్షాన పోరాటం చేస్తుంది. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతులకు మద్దతు ధర కల్పించకపోతే జనసేన పార్టీ తరఫున రైతులకు మద్దతుగా అందోళన చేపడతాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెడన నియోజకవర్గ వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు.
వీటిని కూడా చదవండి :
సీఎం భజన చేయడానికి అసెంబ్లీ సమావేశమా ? : జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి
భవన నిర్మాణ కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి : జనసేన నాయకుడు అక్కల గాంధీ మోహనరావు
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : జనసేన PAC సభ్యులు చిలకం మధుసూధన్ రెడ్డి
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here