రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతు, చేనేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ రాష్ట సభ్యులు చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ రాష్ట ప్రభుత్వం ప్రజలను విన్మరించిందన్నారు. అసెంబ్లీలో వారికివారే పొగుడుకుంటూ ప్రసంగాలు చేశారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా బారినపడి ఆస్పత్రిల్లో బెడ్డు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వీటి గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదన్నారు. కులాలు, మతాలుగా విభజించి అదే సంక్షేమం అనే చెప్పే ప్రయత్నం చేయడం విచారకరం అన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. నేతన్న నేస్తం పథకానికి రూ. 190 కోట్లు ప్రకటించారుకానీ ఇది ఏమూలకూ సరిపోదన్నారు. వీటికి రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల గురించి బడ్జెట్‌లో నామమాత్రపు ప్రస్తావనే ఉందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇవ్వాలని సిఎం బడ్జెట్ సమావేశంలో ప్రసంగించారని అయితే తమ సొంత (గ్రామంలో వైసిపికి ఓటు వేయలేదని 13 మంది పింఛన్లను తొలగించారని చెప్పారు. వీటిపై సిఎంకు లేఖ పంపుతామన్నారు.
వీటిని కూడా చదవండి :
సీఎం భజన చేయడానికి అసెంబ్లీ సమావేశమా ? : జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి
భవన నిర్మాణ కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి : జనసేన నాయకుడు అక్కల గాంధీ మోహనరావు
ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల రద్దు హర్షణీయం : రేఖగౌడ్
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here