రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలను రద్దు చేస్తూ ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం అని జనసేన పార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మెన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎన్నికలు నిలిపి వేస్తే తిరిగి అదే నోటిఫికేషన్ పై ఏడాది తరువాత జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిబంధనలను తుంగలోతొక్కి ఏప్రిల్ లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టినపుడే జనసేనపార్టీ తీవ్రంగా వ్యతిరేఖించిందని గుర్తుచేశారు. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని జనసేనపార్టీ డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఎన్నికలను నిర్వహించడం జనసేనపార్టీ హైకోర్టును ఆశ్రయించడం చివరకు హైకోర్టు ఎన్నికలను రద్దు చేయాలని తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విజయం అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సామాన్యుడు జనసేన పార్టీ మైనార్టీ నాయకులు షానవాజ్ గారు
అన్నదాత రోడ్డు పాలు… ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి : మైలవరం జనసేన ఇంచార్జ్ అక్కల రామ మోహన రావు
జనసేన కార్యకర్త ఉపేంద్ర మృతి పార్టీకి తీరని లోటు : రాహుల్ సాగర్
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here