Search
Close this search box.
Search
Close this search box.

విపత్కర పరిస్థితిలో జర్నలిస్టులు, ఆదుకోని ప్రభుత్వం : జనసేన నాయకులు అక్కల రామమోహన రావు

   విపత్కర పరిస్థితిలో జర్నలిస్టులు – రాతలెన్ని రాసినా బ్రతుకు రాత మారక ఆర్ధికంగా చితికి పోతున్న వైనం

యాజమాన్యం ఆదుకోదు – ప్రభుత్వం పట్టించుకోదు… 

                   ఫ్రంట్ లైన్ వారియర్స్’గా గుర్తించాలని డిమాండ్ చేసిన జనసేన రాష్ట అధికార ప్రతినిది మైలవరం నియోజకవర్గం ఇన్ చార్జ్ అక్కల రామ మోహన రావు.( గాంధీ ) గారు.  సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల ఉండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే వారు జర్నలిస్టులు. ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని జనం మధ్య ఉండి అక్షరాలు వర్తలుగా చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తు సమాజ నిర్మాణంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటిది గత ఏడాది నుండి జర్నలిస్టులు కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లో యాజమాన్యం ఆదుకోక, ప్రభుత్వం నిరాదరణకు గురై ఆర్ధికంగా చితికిపోతున్నారు. కరోన మహమ్మరికి ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులు ఆసుపత్రుల పాలై సరైన వైద్యం అందక సాయం కోసం ఎదురు చూస్తుండగా, దురదృష్టవశాత్తు కొంత మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. కరోన బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు అందిస్తామని ప్రకటించిన నేటి వరకు అందలేదన్నారు. ఇపుడు వారి కుటుంబాలు రోడ్డు పాలు ఆయే పరిస్థితి. ఫ్రంట్ లైన్ వారియర్స్’గా ప్రభుత్వం గుర్తిస్తే కనీసం “వ్యాక్సిన్’ వేసుకొని ప్రాణాలు కాపాడుకొని చిన్నా- చితకా పనులు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటామని జర్నలిస్టులు వేడుకుంటున్న ప్రభుత్వానికి కనికరం లేకపోవడం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదన్నారు. అందరికి అన్ని చేశామని చెబుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఇంత నిర్లక్ష ధోరణి అవలంభించడం శోచనీయం. రాతలెన్ని రాసిన జర్నలిస్టుల బ్రతుకు రాత మాత్రం మారడం లేదని, నాలుగో స్తంబాన్నీ కూలిపోనీయకుండా నిబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. గతంలో జనసేన పార్టి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే విలేకరులను ఫ్రంట్ లైన్ వాలియర్స్’గా గుర్తించాలని,కరోనా వచ్చిన వారికి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని,ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని, హాస్పిటల్ నందు ప్రేత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేయాలని హెల్త్ కార్డులు తక్షణమే అమల్లోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. విలేకరులకు ఇస్తామన్నా హోసింగ్ ప్లాట్లు ఇవ్వాలని అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డు తక్షణమే అందరికి ఇవ్వాలని,పాత్రికేయులు రక్షణ కల్పించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way