అనంతపురము సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్రెజర్ సరిగా లేక రోగుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని బీజేపీ నాయకులు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు ధ్వజమెత్తారు. అంతపురం జిల్లాలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం నుండి శనివారం వరకు ఆసుపత్రిలోనే 22 మంది మృతి చెందారు. శనివారం ఒక్క రోజే 15 మంది రోగులు ఆక్సిజన్ సరిగా అందక మృతి చెందారు. అధికారులు, మరియు వైద్యుల అలసత్వం నిర్లక్ష్యంతోనే ఈ మరణాలను జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఆశించిన స్థాయిలో ఆక్సిజన్ అందటం లేదు దీనికి ప్లాంట్ వద్ద ప్రెజర్ రెగ్యులేటరు సరిగ్గా లేకపోవడం, ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీ, ఆసుపత్రి అధికారుల మధ్య సమన్వయం లేదు. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షినకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నా ఫలితం లేదు. ఆక్సిజన్ రోగికి ఎంత ఆక్సిజన్ అవసరం ఉందో అంత పరిమాణంలో ఆక్సిజన్ అందించడం లేదు. పైప్లైన్ ద్వారా అందుతున్న ఆక్సిజన్ రోగికి కావలసినంత పరిమాణంలో ఆక్సిజన్ ప్రెజర్ లేకపోవడం వల్ల రోగులు విలవిలలాడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదంతయు ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకోవాలి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. మరణించిన రోగులు అందరికి కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈ మరణాలు సంభవించాయి కాబట్టి ఆక్సిజన్ ప్రజలు సరిగా లేక మరణించిన రోగి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.
అదేవిధంగా జిల్లాలో కరోనా వ్యాప్తి నివారించడంలో జిల్లా యంత్రాంగం వెంటనే అన్ని మండల కేంద్రాల్లో కూడా కొరోనా క్వారెంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇదివరకు మొదటిదశ కరోనా వచ్చినప్పుడు కాలేజీలు పాఠశాలలు భవనాల్లో ఏర్పాటుచేసినట్లు గాన ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్వారెంటయున్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా త్వరగా అదేవిధంగా చూడాలి. లేనట్లయితే పాజిటివ్ లక్షణాలు ఉన్నటువంటి రోగులు జనం మధ్యనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం వల్ల అందరికీ ఈ వ్యాధి విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి త్వరగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన వారిని వ్యాధి లక్షణాలు తక్కువగా వారిని స్థానిక అందుబాటులో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్లలో చేర్పించాలి. గతంలో మాదిరిగానే చికిత్స పొంది ఇంటికి వెళ్లి వారిని రెండు వేల రూపాయలు ఇచ్చి పంపాలని బిజెపి కోరుకున్నది. అనంతపురం జిల్లా ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యాపార దృష్టితో దోపిడీ చేస్తున్న దృష్ట్య జిల్లాలో ప్రత్యేకంగా విజిలెన్స్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ నియంత్రలో వైద్యము మరియు ఆసుపత్రులు, అవసరమైన మందులు మరియు ఫీజులు ఉండేవిధంగా చూడాలి.
ఆంధ్రప్రదేశ్లో నిత్యం సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు తాజా వార్తలు అందిస్తూ సేవలందిస్తున్న మీడియా రంగంలోని జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రంట్లైన్ వారియర్ గా గుర్తించి జర్నలిస్టులందరికీ ప్రభుత్వమే ఉచితంగా టీకామందు వేయాలి. జర్నలిస్టులు కరోనా వ్యాధి బారినపడి నట్లయితే వారిని ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా వైద్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కోరుచున్నది. అదేవిధంగా రోజుకు వేల సంఖ్యలో కరోనా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం 10తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలి. ఒకవేళ పరీక్షలు నిర్వహించినట్లు అయితే వ్యాధిబారిన పడే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు హాజరై నట్లయితే వారందరూ కూడా కుటుంబ సభ్యులతో కలవడం వలన మరింత మందికి విద్యార్థుల ద్వారా వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రాణాలతో ఇబ్బంది ఉన్నప్పుడు పరీక్షలు ఒక రెండు నెలల పాటు వాయిదా వేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కావున రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఆరోగ్య భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బిజెపి కోరుచున్నది.