కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలనీ నియోజకవర్గ జనసేన పార్టీ నేత బాడిశ మురళీకృష్ణ ఒక ప్రకటన లో తెలియజేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కరోనా తీవ్రత వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలందరూ తీవ్ర భయాందోళన లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న తీరును వ్యవహారిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో అనేక పాఠశాలలు సంక్షేమ వసతి గృహల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా అనేక జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వాటి హాస్టల్ లో ఉన్నవారు ఈ వైరస్ సోకి ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను చెప్పిన షెడ్యూల్ ప్రకారమే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం ప్రభుత్వ మూర్ఖత్వ పోకడ అని అర్ధమవుతుంది. దీర్ఘకాళిక సమస్యలు ఉన్నవారిని వృద్దులని మరియు చిన్నారులను కరోనా ముప్పునుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి అని వైద్య నిపుణులు పదే పదే చెబుతూ ఉన్నారు. ఎటువంటి లక్షణాలు చూపించకుండా కరోనా వైరస్ మానవాళిపై దాడి చేస్తుంటే పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్లాస్ లు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం పాలకుల కు ప్రజల యోగక్షేమలు ఆరోగ్యం పై ఏ మాత్రం బాధ్యత లేకపోవడమే అవుతుంది. కావున ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచన చేసి చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలను రద్దు చేయాలనీ బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.