జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర ఈ విధంగా డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ విద్యార్థుల ప్రాణాలతో చలగాటం అవసరమా అని ప్రశ్నించారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ ఉన్న పరిస్థితి ఈ పరిస్థితులలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణ పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి ప్రమోట్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ తరగతులకు ప్రవేశం దిశగా అక్కడ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పదో తరగతి పరీక్షలు నిర్వహించడం ఏమిటి అని ప్రశ్నించారు. సీబీఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలల్లో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. ఈ తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమాత్రం సమంజసం కాదు. మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయంతో ఏకీభవిస్తారా? లేదంటే మొండిగా వెళ్లి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆవేశానికి గురి అవుతారు మీరే నిర్ణయించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి, నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, కొప్పాక కళ్యాణ్, గూడుపు తాతబాబు, బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నేతల బుచ్చిరాజు పాల్గొన్నారు.