విజయనగరం జిల్లా శృంగవరపుకోట మేజర్ పంచాయతీ లోపారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె 24 వరోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో పిల్లాపాపలతో సైతం నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనకార్యక్రమాన్ని చూసినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు చలించి శ్రీ గౌరి కమ్యూనిటీ హాల్ శృంగవరపుకోటలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల పోరాటానికి సంఘీభావ సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరుపున వబ్బిన సన్యాసినాయుడు గారు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పధ్ధెనిమిది మేజర్ పంచాయతీలు ఉండగాఏ ఒక్క పంచాయితీలో టెండర్లు పిలవలేదు. కానీ, శృంగవరపుకోట మేజర్ పంచాయతీలో ఈవోపీఆర్డీ గారికి ఎన్నికల కోడ్ సమయం అలాగెే మరో ప్రక్క కరోనా విస్తరిస్తున్న వేళలో నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఈవో గారు పబ్లిక్ టెండర్ పిలిచారు. మార్చి నెలాఖరువునా టెండర్ పిలిచి ముందు ఈవోపిఆర్డి గారికి ఇవేవీ తెలియదా అని అన్నారు. 2015 లో రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు యొక్క శ్రమను గుర్తించి పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులను సొసైటీగా ఏర్పాటుచేసి వాళ్ళల్లో వారికే టెండర్ విధానం ఇవ్వాలనిఅలాగే రెండు వెయ్యి పదిహేనులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కుాడాఒక తీర్పునిచ్చింది. జీవో.నంబర్ 57ప్రకారం టెండర్ బయటివారికి ఇవ్వకున్నాప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకే టెండర్ ఇవ్వాలని వీరంతా పది నుంచి ముప్పై ఏళ్ల గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారే ఇప్పటికైనా ప్రభుత్వం వీరియొక్క శ్రమను గుర్తిస్తాం గుర్తిస్తుందని మెరుగైనటువంటి జీతాన్ని ఇస్తుందన్న ఉద్యోగ భద్రత కల్పిస్తుందని ఆశతో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. చాలీ చాలని అరకొర వేతనాలతో కుటుంబాలను పోషిస్తున్నారు. వీరంతా దళితులు ఇటువంటి వారి పొట్టకొట్టేందుకు ఈవోపీఆర్డీ శ్రీనివాసరావుగారు కంకణం కట్టుకున్నారని ఆవేదన చెందారు నిబంధనలు ఉల్లంఘించి న్యాయస్థానం చెప్పిన మాటలు కూడా గౌరవించలేదన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.