
జనసేన పార్టీ కార్యకర్తల వేడుకల మధ్య జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్‌లో ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ తాళ్లూరి రామ్ ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఖమ్మం నగర కమిటి అధ్యక్షులు మిరియాల జగన్, ఖమ్మం నగర సమన్వయకర్త యండి సాధిక్ అలీతో కలిసి ఆయన మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు రెండు కళ్లువంటివని, రెండు రాష్ట్రాల అభివృద్దికి ఆయన పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల మేరకు రెండు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తున్నారని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేసే క్రమంలో ఖమ్మంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించటం జరిగిందని రామ్ తాళ్లూరి తెలిపారు. ప్రశ్నించేతత్వంతో పార్టీ ఏర్పడిందని ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులనైనా, అధికారులనైనా ప్రశ్నిస్తుందని, తద్వారా సమస్యల పరిష్కారంలో ముందుంటామని తెలిపారు. ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలతోపాటు, భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోను జనసేన పార్టీ పోటీచేస్తుందని తెలిపారు. ఖవ్ముం జిల్లా ప్రజలు రాజకీయ చతురతను ప్రదర్శిస్తారని, మంచివారిని ఎన్నికల్లో గెలిపిస్తారని దీనికి తగ్గట్లుగానే రానున్న రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ ఢంకా మైోగిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తొలుత నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెయ్యిమందితో భారీ బైక్‌ర్యాలీ నయాబజార్ నుండి మయూరి సెంటర్, పాతబస్టాండ్ వైరారోడ్డు, జెడ్పీ సెంటర్, టూటొౌన్ పోలీస్‌స్టేషన్, రోటరీనగర్ మీదుగా శ్రీ శ్రీ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం నూతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్యమ్‌ఖాన్, తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్‌గౌడ్, కార్యనిర్వహక కార్యదర్శి వివి రామారావు, జీహెచ్‌ఎంసీ అధ్యక్షులు రాథారామ్ రాజలింగం, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి దుంపటి శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ ఇంచార్జ్ ఆకుల సుమన్, యువజనవిభాగం అధ్యక్షులు లక్ష్మణ్‌గౌడ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్‌నాయక్, మహిళా నాయకురాలు కావ్య, ఖమ్మం నగర ప్రధానకార్యదర్శి సురభిసూరజ్ కిరణ్, జిల్లా, నగర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు