కరోనాను లెక్క చేయకుండా విపత్కర సమయంలో నిస్వార్థంగా పేద ప్రజలకోసం తమవంతు సేవా అందించడంలో ధైర్యంగా ప్రజలలోకెళ్లి సేవా చేసే అవకాశం కల్పించుకున్న నిజమైన ప్రజాసేవకులు జనసైనికులని వారిని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మెన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ కోరారు. సోమవారం రోజు ఎమ్మిగనూరు జనసేనపార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ బరిలో నిలిచిన వార్డు అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా రేఖగౌడ్ మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చేది అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తారని ప్రభుత్వాలకు పట్టంకడితే అదే ప్రజలను ఎన్నికల్లో సంక్షేమ ఫలాలు రావాలంటే ఓటు వేయాలని శాసించేలా భయాలు కల్పించడం భావ్యం కాదన్నారు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. రాష్టంలో కరోనా లాంటి విపత్కర సమయాల్లో పేదవాడి ఆకలిని ప్రత్యక్షంగా చూసింది జనసైనికులేనని వారికి అండగా నిలిచింది జనసైనికులు మాత్రమే అని గుర్తుచేశారు. అరకొర అభివృద్ధిని చూపి ప్రజలను ఏవిధంగా ఓటు అడగుతారని ప్రశ్నించారు, స్వతహాగా ప్రజలకోసం స్వచ్చందంగా సేవా కార్యక్రమాలు చేసే జనసైనికులను గెలిపిస్తే అవినీతికి తావు లేకుండా అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు ఆశాజనకంగా ఫలితాలు వచ్చాయని అవే ఫలితాలు మున్సిపాలిటీల్లో అందించి యువతరాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా, మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, నాయకులు రాజశేఖర్, షబ్బీర్, ఖాసీం, మరియు వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.